ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటింటికి రేషన్ సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకానికి స్థానిక ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు బ్రేక్ వేసింది. ఇంటింటికి రేషన్ ఇచ్చే వాహనాలపై పార్టీ నేతల ఫోటోలు, రంగులు, గుర్తులు ఉండటానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం మూడోసారి వాయిదా పడినట్టయింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇంటింటికీ రేషన్ పంపిణీకి అనుమతి కోరూతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల నిబంధనలకు లోబడి రేషన్ సరఫరా జరగాలని హైకోర్టు ఆదేశించింది.
రేషన్ ఎవరి సొంతడబ్బుతో చేస్తున్న కార్యక్రమం కాదని, ప్రజల నుంచి పన్నులుగా వసూలు చేసిన డబ్బుతోనే పథకం నడుస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రేషన్ సరఫరా వివరాలతో 2 రోజుల్లో ప్రభుత్వం ఎస్‌ఈసీని సంప్రదించాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని 5 రోజుల్లో ప్రకటించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Must Read ;- చట్టానికి ఎవరూ అతీతులు కారు: హైకోర్టు