జాబితాలో పేరు లేని కారణంగా తమిళనాడులో చిన్నమ్మ(శశికళ) తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదులైన జయలలిత నెచ్చెలి శశికళ(చిన్మమ్మ)పేరును ఓటరు జాబితా నుంచి తొలగించారు. చాలా కాలంగా పోయెస్ గార్డెన్ చిరునామాలో ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
19 మంది పేర్ల తొలగింపు
జయలలిత మరణం తర్వాత పోయెస్ గార్డెన్ నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లారు. దీంతో అక్కడ నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినా అధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ నిన్న ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. శశికళ ఓటు తొలగింపు అన్నాడీఎంకే కుట్ర అని ఆయన ఆరోపించారు. శశికళ ఓటును ఆమెకు తెలియకుండా అన్యాయంగా తొలగించారని, ఇందులో కుట్ర ఉందని ఆమె తరఫు లాయర్ అంటున్నారు.
Must Read ;- శశికళ రాజకీయ సన్యాసం.. చిన్నమ్మ ప్రకటనకు కారణాలేమిటో..!











