జయలలిత సన్నిహితురాలు శశికళ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అనూహ్యంగా ప్రకటించడం తమిళనాట సంచలనం సృష్టించింది. అక్రమాస్తుల కేసులో బెంగళూరులో నాలుగేళ్లు శిక్ష అనుభవించి ఇటీవలే అట్టహాసంగా చెన్నై చేరుకోవడంతో ఇక ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. ఆమె బరిలో దిగితే అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంది. జయలలిత పార్టీకి నష్టం కలిగించకూడదని, ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకేకు ఆ అవకాశం ఇవ్వకూడదనే చిన్నమ్మ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి డీఎంకేను ఓడించాలని ఆమె పిలుపు ఇవ్వడం గమనార్హం. శశికళ రాజకీయ సన్యాసానికి కారణాలపై రకరకాల ఊహగానాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం తెర వెనుక ఒత్తిళ్లా లేక భవిష్యత్తులో ఏదేనా పదవి ఇస్తామన్న హామీతో ఆమె ఈ ప్రకటన చేశారా అన్నది భవిష్యత్తులో తేలనుంది.
Must Read ;- కమలదళం స్కెచ్.. శశికళా విరమణం










