తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముమ్ముర ప్రచారం చేస్తున్నారు. టీ తాగుతూ, స్థానికులను కలుసుకుంటూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాడు. ప్రచారంలో ఇతర పార్టీల కంటే టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. అయితే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే రంగంలోకి దిగనున్నారు. రేపట్నుంచే తిరుపతి నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 15 వరకు తిరుపతిలోనే ఉండి పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు, సంప్రతింపులు, గెలుపు కోసం తీసుకోవాల్సిన కార్యాచరణ లాంటి అంశాలపై ఫోకస్ చేయనున్నారు. చంద్రబాబు త్వరలోనే ఎన్నిక ప్రచారంలోకి దిగనుండటంతో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ఆసక్తికరంగా మారనుంది.
Must Read ;- టీడీపీ స్మార్ట్ వర్క్..హార్డ్ వర్క్ @తిరుపతి