నిమ్మగడ్డ అనుకున్నది సాధించాలనే గట్టి పట్టుదల మీద ఉన్నట్లున్నారు. పంచాయతీకి ఇంకా శుభం కార్డు పడకముందే.. పురపాలక సంఘ ఎన్నికలకు తెరతీస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం రేపే (ఫిబ్రవరి 15) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అనుకోని అవాంతరాలు ఎదురైతే ఈనెల 17న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో భాగంగా 12 నగరపాలక సంస్థల్లోని 671 డివిజన్లు, 75 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్న ఎన్నికల కమిషన్. నోటిఫికేషన్ విడుదల చేసన నెల రోజల్లోగానే ఎన్నికలు జరిగే అవాకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మార్చి 15-20 లోగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నకల నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.
నిజానికి, రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గతేడాది మార్చి 23వ తేదీన ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదే నెల 11వ తేదీన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే అదే సమయానికి దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ కరోనా విస్తరిస్తుండడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్నకలను వాయిదా 6 వారాలపాటు వాయిదా వేస్తూ.. గతేడాది మార్చి 15న ఉత్తర్వులిచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పుడు ఈ ప్రక్రియను కొనసాగించడానికి పూనుకున్నారు నిమ్మగడ్డ. అందుకు నోటిఫికేషన్ రేపే విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Must Read ;- మరో ఎన్నికలకు నగరా.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వేడి