మున్సిపల్ ఎన్నికలపై విజయవాడలో ఎస్ఈసీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ , టీడీపీ నేత వర్ల రామయ్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రధాన పార్టీల నుంచి నేతలు సమావేశానికి హాజరవగా అన్ని పార్టీల విజ్ణప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియామళిని అందరూ పాటించాలని ఎస్ఈసీ కోరారు.
కాగా, సమావేశంలో వర్ల రామయ్య తన మాటలకు అడ్డుపడటంపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చిరించినా ఆయన పట్టించుకోక పోవడంతో వర్ల రామయ్యను బయటకు పంపాలని సెక్కూరిటీ అధికారులకు చెప్పారు. దీంతో ఎస్ఈసీ మొక్కుబడిగా సమావేశం ఏర్పాటు చేసినట్లు అనిపిస్తోందని, ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, దాడులపై వివరించాలని ప్రయత్నిస్తే ఎస్ఈసీ నిరాకరించారని వర్ల అన్నారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. ఎస్ఈసీ గతంలో వలే లేరని వర్ల రామయ్య ఆరోపణలు చేశారు.