టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మూడేళ్ళ క్రితం నక్షత్రం సినిమా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి దారుణమైన ఫలితం వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే మూవీని చెక్కే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. మారాఠీ సూపర్ హిట్ మూవీ .. నటసామ్రాట్ సినిమాకిది అఫీషియల్ రీమేక్. ఎప్పటి నుంచో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ.
ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే.. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందనే వార్తలొస్తున్నాయి. నాటక రంగంలోని ఓ ప్రముఖ వ్యక్తి జీవితం ప్రయాణంలో ఏర్పడ్డ ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఒరిజినల్ వెర్షన్ లో నానా పాటేకర్ అద్భుతంగా నటించిన పాత్రను ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. గతంలో అంతఃపురం, ఖడ్గం ప్రకాశ్ రాజ్, కృష్ణవంశీ కలయికలో వచ్చిన క్లాసిక్స్ లాంటి సినిమాలు. ఈ నేపథ్యంలో ఈ సినిమామీద మంచి అంచనాలున్నాయి.
ఇంతవరకూ రంగమార్తాండ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ మెంట్ ఒకటే వచ్చింది. దాని తర్వాత పోస్టర్స్ కానీ, టీజర్ కానీ రివీల్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. సినిమా టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్, రాబోతున్నాయట. మరి రంగమార్తాండ సినిమాతో కృష్ణవంశీ మళ్ళ బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.