వాళ్లంతా పేదలు… రెక్కాడితే కానీ డొక్కాడదు… ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు కొనుక్కోలేరు. శానిటైజేషన్ చేసుకోలేరు. మనసుకు నచ్చింది చేయడమే వాళ్లకు తెలుసు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో పది రూపాయలతో మాస్కు కొనలేని పెద్దాయన డిఫరెంట్ గా ఆలోచించాడు. మాస్క్ ఏదైతేనేం.. కరోనా బారిన పడకుంటే చాలు అని అనుకున్నాడేమో… ఏకంగా పిచ్చుకల గూడును మాస్క్ గా ధరించాడు. మహాబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలోని చిన్నమునుగాల్ చెడ్ కు చెందిన మేకల కరుమన్న అనే పెద్దాయన పిచ్చుక గూడు మాస్కు ధరించి ఊరందరినీ ఆశ్చర్యపరిచాడు. కరోనా పెరుగుతుండటంతో మాస్క్ ధరించాలని చెప్పకనే చెప్పాడు. తాత మాస్క్ ను చూసిన ప్రతిఒక్కరూ భలే ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు.
Must Read ;- డబుల్ మాస్క్‌తో కరోనాకు చెక్











