నిజామాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో ఏడుగురు దిగి గల్లంతు అయ్యారు. గల్లంతైనవారి కోసం గాలించగా ఆరుగురి బాడీలు దొరికాయి. వీరంతా నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు సురేష్(40), యోగేష్ (16), శ్రీనివాస్((40), సిద్దార్థ్ (16), శ్రీకర్ (14), రాజు(24). వీరంతా మాక్లూర్ మండలం దీకంపల్లి, గుత్ప, నిజామాబాద్ నగరం లోని ఎల్లమ్మ గుట్టకు చెందిన వారుగా తెలుస్తోంది. పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమంలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోచంపాడు పుష్కర్ ఘాటు ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన కలిచివేసిందని, చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు.
Also Read:గోదావరిఖని బొగ్గు గనుల్లో ‘సలార్’ షూటింగ్