పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో కమ్ బ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీని తర్వాత నుంచి పవర్ స్టార్ నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. ఆయన కెరీర్ లో ఈ తరహాలో ఎప్పుడూ సినిమాల పరంపర ను ఎరుగని అభిమానులు ఎంతో ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ .. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ మూవీని పట్టాలెక్కించగా.. దీని తర్వాత హరీశ్ శంకర్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేందుకు రెడీ అవుతోంది.
ఇక వీటిలో ‘వకీల్ సాబ్’ మూవీ తర్వాత విడుదల కాబోతున్న సినిమా ‘హరిహర వీరమల్లు. పవర్ స్టార్ కెరీర్ లోనే తొలి జానపద చిత్రం కావడంతో.. దీన్ని ఆయన చాలా ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ విషయంలోనూ పెర్ఫెక్షన్ ను కోరుకుంటున్నారు. అందుకే పవర్ స్టార్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకి అందులో మంచి ప్రవేశం ఉండడంతో చాలా అలవోకగా ఆ పని చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బళ్ళెం, కత్తి తిప్పడం, హార్స్ రైడింగ్ తో కత్తి యుద్ధం చేయడం లాంటివి సాధన చేస్తున్నారు.
ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సెట్స్ నుంచి వచ్చిన దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక శిక్షకుడితో పవర్ స్టార్ బళ్ళాన్ని తిప్పడం ఆ ఫోటోస్ లో కనిపిస్తుంది. అప్పట్లో దాదాపు పవర్ స్టార్ నటించిన ప్రతీ సినిమాలోనూ కత్తి తిప్పడం ఉండేది. ఇప్పుడు మరోసారి ‘హరిహర వీరమల్లు’ సినిమా లో పవన్ కళ్యాణ్ కత్తి తిప్పడం అభిమానులను ఖుషీ చేస్తుందనడంలో సందేహం లేదు. మరి వీరమల్లుగా ఆయన ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తారో చూడాలి.
Also Read:పవర్ స్టార్ సరసన టాలెంటెడ్ బ్యూటీ?