June 7, 2026 6:04 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

సిరిమానోత్సవం.. విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం

పైడిత‌ల్లి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్సవం అని అందరూ గుర్తిస్తారు. ఇది రాష్ట్ర పండుగ. ఎంతో అట్టహాసంగా జరిగే ఈ సిరిమానోత్సవాన్ని కొవిడ్ ఆంక్షల కారణంగా అనేక జాగ్రత్తల మధ్య ఈసారి నిర్వహిస్తున్నారు.

October 25, 2020 at 7:14 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

ఉత్త‌రాంధ్రుల క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌ ఇల‌వేలుపు శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్స‌వం. విజయదశమి అనంతరం వచ్చే మంగళవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ సంబరాన్ని ఈ ఏడాది నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ప్రత్యక్షదర్శనానికి అవకాశం లేనప్పటికీ ప్రత్యామ్నాయం కల్పిస్తూ, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది.

శోభాయమానంగా విజయనగరం

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నేపధ్యంలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన విజయనగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. పట్టణంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రసిద్ధి గాంచిన పైడితల్లి అమ్మవారి ఆలయాలు చదురుగుడి, వనంగుడి, కోట, మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం, ఇతర ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాలతో అలంకరించారు. వాణిజ్య, వ్యాపార సంస్థలను ఎవరికి వారుగా విద్యుత్ దీపాలతో అలంకరించుకోవడంతో పట్టణానికి ప్రత్యేక శోభ చేకూరింది. 

ఈ ఏడాది విజయదశమి ఆదివారం కావడం వెనువెంటనే సోమవారం అమ్మవారి తొలేళ్లు, మంగళవారం సిరిమాను నిర్వహించనుండటంతో పట్టణంలో పండుగ సందడి, జన రద్దీ ఎక్కువైంది. ప్రతీయేటా సిరిమానుకు ముందు మూడురోజులు నిర్వహించే విజయనగరం ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ ఏడాది చేపట్టకపోవడం, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, పులివేషాలు నిషేధించడం వల్ల కొంత వెలితి చోటుచేసుకుంది.

మూడు శతాబ్దాలుగా..

పైడితల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా పూసపాటి రాజుల ఇలవేల్పుగా భాసిల్లుతోంది.  పైడితల్లి అమ్మవారి దేవాలయం విజయనగరం మూడు లాంతర్లు కూడలి వద్ద 1757లో నిర్మించారు. 1758లో  ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటివరకూ సుమారు మూడు శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. 

ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుప‌ల్లి వెంకటరావు ఏడో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.

చారిత్రక నేపథ్యం ..

అమ్మవారుగా కొలవబడుతున్న పైడితల్లి విజయనగరం పూసపాటి రాజవంశీయులు పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు. 

1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించారు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. 

ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయింది. అప్పటినుండి ఆమెను అమ్మవారిగా కొలుస్తూ ప్రతి ఏటా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.

వైభవంగా అమ్మవారి పండుగ : కలెక్టర్

ఎన్నో ఏళ్లుగా వ‌స్తున్న సంప్ర‌దాయాల మేర‌కు పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను ఉత్స‌వాల‌ను ఈ ఏడాది కూడా రాష్ట్ర పండుగగా, వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. సంప్ర‌దాయాల‌కు భంగం క‌ల‌గ‌కుండానే కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఉత్స‌వాలు జ‌రిపేలా అన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. ఉత్స‌వాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఏవిధ‌మైన అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. 

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈనెల 27న అమ్మ‌వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, ఉప ముఖ్య‌మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, ప‌ర్యాట‌క సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు, ప‌లువురు పార్ల‌మెంటు, శాస‌న‌స‌భ్యులు ఉత్స‌వాల్లో భాగంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకొనేందుకు వ‌స్తున్నట్టు స‌మాచారం వ‌చ్చింద‌న్నారు. 

అధికారులంతా స‌మ‌న్వ‌యంతో స‌మిష్టిగా ప‌నిచేస్తూ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు కృషిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కోసం ఈ ఏడాది ప్ర‌భుత్వం ఇద్ద‌రు ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మించింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చెప్పారు. దేవాదాయ‌శాఖ త‌ర‌పున కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దేవ‌స్థానంకు చెందిన డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఎన్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తిని నియ‌మించార‌ని చెప్పారు. 

సిరిమాను త‌యారీలో అనుభ‌వ‌జ్ఞులైన అట‌వీశాఖ అధికారి జి.ల‌క్ష్మ‌ణ్‌ను కూడా మూడు రోజుల‌పాటు ఉత్స‌వాల ప్ర‌త్యేక అధికారిగా నియ‌మిస్తూ ఆదేశాలు జారీచేశార‌ని, వారు ఇప్ప‌టికే విధుల్లో చేరార‌ని తెలిపారు.

శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు : డిఐజి

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి. రంగారావు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై విజయనగరం ఎస్పీ బి. రాజకుమారితో కలిసి సమీక్షించారు. సిరిమానోత్సవం ప్రజల మనోభావాలు, భక్తి, సంప్రదాయాలకు సంబంధించినదైనందున బందోబస్తు నిర్వహించే పోలీసులు, మహిళా సంరక్షణ పోలీసులు ప్రజలతో మర్యాదతో ప్రవర్తించాలన్నారు. 

కరోనా కారణంగా గుమిగూడి ఉండే ప్రజల్లో తిరగడం అనర్ధదాయకమని, కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఇంటికే పరిమితం కావాలని, టివిల్లో సిరిమానోత్సవాన్ని తిలకించి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలకు హితబోధ చేశారు.

Tags: leotoppaiditalli festivalsirimanotsavamvijayanagara kingdom
Previous Post

రాజధాని దిశగానేనా? : విశాఖ మెట్రోకు అడుగులు పడుతున్నాయ్!

Next Post

నీళ్లలో G+3 ఇళ్లు.., నట్టేట్లో లబ్ధిదారులు..!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

Janhvi Kapoor looking hot in Saree

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

కష్టాల సుడిలో టీ సర్కార్ : ప‌దివేల ప్యాకేజీ గట్టెక్కించేనా?

పెళ్లి మండపంగా మారిన కొవిడ్ సెంటర్

బాలకృష్ణ సరసన కథానాయికగా సీనియర్ నటీమణి

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist