సోనూసూద్ అంటే కేవలం పేరు మాత్రమే కాదు.. అతన్ని దేవుడిగా కొలుస్తున్నవారు లేకపోలేదు. సోనూసూద్.. లాక్ డౌన్ ముందు వరకు సినమా నటుడుగా మాత్రమే అందరికీ పరిచయం. లాక్ డౌన్ సమయంలో ప్రజల కష్టాలు చూడలేక వారి పాలిట దేవుడిగా మారిన వ్యక్తిగా ఎదిగాడు. కేవలం లాక్ డౌన్ వరకు మాత్రమే తన సేవలు పరిమితం చేయలేదు.. నేటికి కష్టమన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు సోనూ. చుదువుకోవాలా.. ఉద్యోగం లేక ఇబ్బందిపడుతున్నారా.. మీ వాళ్లు విదేశాల్లో చిక్కుకున్నారా.. చికిత్సకు డబ్బులు అవసరమా.. ఇలా ఏ సమస్యలున్నాసరే సోనూసూద్ ఉన్నారుగా అనేంతలా అందరి వాడిలా మారిపోయాడు సోనూ. ఇటీవల తెలంగాణలో ఏకంగా సోనూకు గుడి కూడా కట్టారు. మరీ ఏంటిది పిచ్చిగా అనుకోకండి.. ప్రజల కష్టాలు చూసి చలించి సాయం అందించే ఎవరైనా దేవుడే అవుతారు. తాజాగా మరో ఘటన సోనూ ఆకాశమంత హృదయానికి నిదర్శంగా నిలిచింది.
చిన్నారిని కాపాడిన సోనూ..
ఇదేమీ కొత్త విషయం కాదు.. ఇదివరకు సోనూసూద్ ఇలాంటి పనులెన్నో చేశారు. ఎందరినో కాపాడారు. చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసి వారి ప్రాణాలు నిలబెట్టారు. తాజాగా అలాంటి సంఘటనే పునారవృతమైంది. కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామానికి చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతిల దంపతులకు 15 నెలల క్రితం ఒక పాప జన్మించింది. ఆ చిన్నారి పేరు వర్షిత. పుట్టిన కొంత కాలానికే పాపకు గుండె సంబంధించిన వ్యాధి ఉందని తెలిసి తల్లిదండ్రలు కుమిలిపోయారు. పాపను బతికించుకునే డబ్బులులేక బిడ్డను చంపుకోలేక ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాంటి సమయంలోనే ఎందరికో సహాయం అందిస్తున్న సినీ నటుడు సోనూసూద్‌కు తమ సమస్యను వివరించారు.
వెంటనే స్పందించిన సోనూ
సమస్య తెలియడంతోనే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పాప చికిత్సకు అవసరమైన మొత్తాన్ని ఆసుపత్రికి చెల్లించడానికి సోనూ సిద్దమయ్యాడు. కేవలం చెప్పడం కాదు.. ముంబై ఆసుపత్రిలో పాపకు చికిత్సకు అవసరమైన 4.50 లక్షలు చెల్లించారు. ఆపరేషన్ పూర్తై పాప కోలుకుంటూ ఉండడంతో.. చిన్నారి ప్రాణాలు కాపాడిన సోనూకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Must Read ;- అమితాబ్ కి తాను రాసిన బుక్ అందచేసిన సోనూసూద్..!