టాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం ఎపిక్ లవ్ స్టోరీ ‘శాకుంతలం’ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సమంత శకుంతలగా నటిస్తూండగా గుణశేఖర్ స్వీయ నిర్మాణంలోనే మూవీ తెరకెక్కబోతోంది. ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తవలేదు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్ని ముమ్మరం చేశారు గుణశేఖర్. అందులో భాగంగా.. ఈ సినిమాలో అందమైన సెట్స్ డిజైనింగ్ అండ్ ప్లానింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు గుణశేఖర్.

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనున్న ‘శాకుంతలం’ సినిమాకు కథను బట్టి అందమైన లొకేషన్స్ అవసరం అవుతాయి. ముఖ్యంగా కణ్వమహర్షి ఆశ్రమం, దాన్ని ఆనుకొని దండకారణ్యం, జలపాతాలు, రాజప్రాసాదం లాంటివి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దానికి తగ్గట్టుగానే గ్రాఫికల్ వర్క్ కూడా భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే గ్రాఫిక్స్ నిపుణుల చేత గుణశేఖర్ టీమ్ సమావేశమై.. దానికి సరిపడే రీతిలో ఓ స్టూడియో లో సెట్స్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. అతి త్వరలోనే సినిమా లాంఛింగ్ జరుగుతుంది. ఆ తర్వాత సినిమా టీమ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తుంది.
Must Read ;- ‘శాకుంతలం అంత వీజీ కాదేమో?











