రీల్ విలన్, రియల్ హీరో సోనూ సూద్ ఏది చేసినా వార్తే. ఎందుకంటే ఇండియా అంతటా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరది. అపర దానకర్ణుడిగా పేరు పొందిన సోనూ సూద్ తరచూ ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్నారు. హైదరాబాద్ రోడ్లపై సోనూ సూద్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం వార్త కాకుండా ఎలా ఉంటుంది. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా సెట్ కు సోనూ సూద్ సైకిల్ పై వెళ్లడం వైరల్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సోనూ సూద్ ఓ పాత్ర పోషిస్తున్నారు. రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూను విలన్ గా సినిమాల్లో జనం చూస్తారా అన్నది అనుమానమే.
దర్శకులు కూడా సోనూ పాత్ర ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందేనేమో. కాస్త మంచి విలన్ గా చూపే ప్రయత్నాలు చేస్తారేమో. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్ మీద వెళ్లడంతో వార్తాగా మారింది. సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టమట. పైగా ఉదయాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎలాగూ వెళ్లాలి కదా అని సైకిల్ ఎక్కారు సోనూ. అటు వ్యాయామం, ఇటు ప్రయాణం రెండూ కలిసొచ్చేశాయి. ఎంచక్కా సెట్ కు వెళ్లిపోయి షూటింగ్ లో పాల్గొన్నారు.
Must Read ;- పంజాబ్ ప్రభుత్వం ఈయన్నే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది