రియల్ హీరో సోనూ సూద్ ను కూడా కరోనా వదిలిపెట్టలేదు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన ఇటీవల తెలుగు సినిమాల షూటింగుల్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం కోవిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది. తాను గత కొన్ని రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని ఆయన తెలిపారు. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంలో ఆయనకు అనేక వినతులు వస్తున్నాయి. తమను ఆదుకోవాల్సిందిగా ఎంతో మంది మెసేజ్ లు చేస్తున్నారు.
‘నాకు కరోనా వచ్చిందని మీరు ఆందోళన చెందవద్దు. మీ సమస్యలు తీర్చడానికి నాకు సమయం దొరుకుతుంది. నేను మే కోసమే ఉన్నా’అంటూ ఆయన వెల్లడించారు. ఇటీవలే ఆయన కోవిడ్ టీకా డ్రైవ్ ప్రారంభించారు. సంజీవని పేరుతో ఈ డ్రైవ్ చేపట్టారు. ఆయన కూడా మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయినా ఆయనకు కరోనా సోకింది. కరనా వ్యాక్సిన్ డ్రైవ్ కు ప్రచార కర్తగానూ పంజాబ్ ప్రభుత్వం ఆయనను ప్రకటించింది.సోనూ సూద్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.