స్టార్ల ట్విట్టర్ అకౌంట్లను నిజంగా వారే చూసుకుంటున్నారా? వేరే వారు ఆపరేట్ చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న పవన్ కళ్యణ్ ట్విట్టర్ ద్వారా తనకు పుట్టిన శుభాకాంక్షలు చెప్పినవారందరికీ కుప్పలుతెప్పలుగా రిప్లయ్ లు వచ్చాయి. అంత సమయాన్ని మన హీరోలు వెచ్చించడం అసాధ్యమే. పైగా ఆయన అకౌంటు నుంచి జవాబులు వచ్చిన వారంతా సంబరపడిపోవడమే కాకుండా వాటిని ఆయన అధికారి సమాధానంగానే భావించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా అవి బాగా విస్తరించాయి.
పవన్ కళ్యాణ్ బర్త్ డే కి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి స్వయంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రిప్లైలు రావడంతో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి పవన్ స్వయంగా కృతజ్ఞతలు కొంతమందికి మాత్రమే తెలిపాడు, మిగతా వారి అందరికీ పీకే సోషల్ మీడియా టీమ్ రిప్లైలు ఇచ్చింది. అందుకే చాలా మంది సెలబ్రిటీలకు ఒకే రకమైన రిప్లైలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై యాంటీ ఫ్యాన్స్ కోణం మరోలా ఉంది.
ఏ మాటకు ఆ మాటే, రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ పాలిటిక్స్ బాగానే నేర్చుకున్నారని యాంటీఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, ట్విట్టర్ లో హ్యాపీ బర్తడే పవన్ కళ్యాణ్ అనే హాష్ ట్యాగ్ ఎంత ట్రెండ్ అయిందో, పావలా కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా అంతే ట్రెండ్ అయింది. చాలా మంది పీకే ఫ్యాన్స్ సరిగా చూసుకోకుండా ఈ పావలా కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్టులు కూడా పెట్టేశారు. ఏదైతేనేం పీకే వద్దంటూనే, కాదంటూనే తన పుట్టినరోజు వేడుకలను సంపూర్ణంగా సెలబ్రేట్ చేసుకున్నాడనే అనుకోవాలి.