ఆత్మవిశ్వాసంతో దేన్నయినా అధిగమించవచ్చంటారు హీరో సుధీర్ బాబు. ఆయన ఈ మాట ఎందుకన్నారంటే వి సినిమా షూటింగ్ కు కొద్ది రోజుల ముందే ఆయన మోకాలుకు గాయమైందట. ఓ పక్క షూటింగ్ కు వెళ్లాలి… ఇంకో పక్క మోకాలి బాధ. దీన్నుంచి బయటపడాలంటే ఫిజియో థెరపీ ఒక్కటే మార్గం. అలా అనేక ఫిజియోథెరపీల అనంతరం ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత వి సినిమాలో చక్కగా డ్యాన్స్ చేసే సన్నివేశంలో నటించారు.
ఎంతో నొప్పి భరిస్తూనే ఫిజియో థిరపీ చేసుకుంటూ తన మోకాలి బలాన్ని పెంచుకున్నారు. ఇదంతా ఎలా చేశారో దాన్ని ఓ వీడియోగా చేసి శనివారం తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా విడుదల చేశారు సుధీర్ బాబు. ఆ వీడియోలో సుధీర్ బాబు మాట్లాడుతూ…‘నేను ఎంత కష్టాన్ని అనుభవించానో చెప్పేందుకు ఈ వీడియో రిలీజ్ చేయడం లేదు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి స్ఫూర్తి కలిగించేందుకు ఈ వీడియోతో ప్రయత్నిస్తున్నా.
కష్టమొస్తే చీకట్లో ఉండొద్దు. వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేయండి. వి సినిమాకు కొన్ని నెలల ముందు నా మోకాలుకు గాయమైంది. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. నొప్పిని తట్టుకుంటూ నడిచేందుకు ప్రయత్నించా.. వ్యాయామాలు చేశాను. ఆ నొప్పి భరించడాన్ని ఎంజాయ్ చేశాను. నా మోటివేషన్ నా సినిమా, నా ప్రేక్షకులు’ అన్నారు.
Believe me, pain is not your enemy, it's your motivator. 💪🙂 If I can, you can !! #VTheMovie #VOnPrime pic.twitter.com/xTud8FjnqD
— Sudheer Babu (@isudheerbabu) September 5, 2020