సినీ నటుడు సునీల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా సునీల్ ఆ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారా ? జనసేనాని నుంచి సునీల్ కి క్లియరెన్స్ వచ్చేసిందా ? పవన్ తో ఇటీవల సమావేశమైన హీరో సునీల్ ఏం చర్చించారు ?
సినీ నటుడు సునీల్ రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్న సునీల్ జనసేన పార్టీలో చేరుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.ఇప్పటికే దీనికి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఆయన చర్చించారని, పవన్ సైతం సునీల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.అదేసమయంలో 2024 ఎన్నికల్లో సునీల్ స్వస్థలం భీమవరం నుంచి ఆయన బరిలో దిగబోతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే సినిమాలతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ , ఇటీవల తన రాజకీయ కార్యక్రమాల్లోనూ యాక్టివా గా ఉంటున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల పై ఆయన ఫోకస్ పెంచినట్లుగానే కనిపిస్తోంది.ఇటీవల జరిగిన జనసేన 8 వ ఆవిర్భావ సభ, అందులో పవన్ చేసిన వ్యాఖ్యాలు దీనికి నిదర్శనంగా ఇలుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే జనేసేనాని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.అందులో భాగంగానే సునీల్ ని రంగంలోకి దించాలని జనసేన అధినేత ఆలోచన అనే వాదన బలంగా వినిపిస్తోంది.
నిజానికి సునీల్ మెగా కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి. ఇక చిరంజీవి తన ప్రేరణ అని, అంతేకాకుండా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని అనేక సందర్భాలలో ఆయన బహిరంగంగా ప్రకటించారు.ఇక మెగా హీరోలు సైతం సునీల్ సినిమాల కోసం పలుమార్లు ప్రమోషన్ కూడా చేశారు.మరోవైపు పవన్ కళ్యాణ్ కు అత్యంత దగ్గరి వ్యక్తి , మంచి స్నేహితుడు అయిన త్రివిక్రమ్, సునీల్ కి బాగా క్లోజ్.ఇద్దరిదీ భీమవరం కావడం విశేషం. ఈ క్రమంలోనే సునీల్ ను భీమవరం నుండి బరిలో దింపితే ఖచ్చితంగా ఫలితం తమకు అనుకూలంగా వస్తుందనే ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని టాక్.ఇటీవల పవన్ తో సమావేశమైన సునీల్ ఇదే అంశం పై చర్చించారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
అయితే తాను రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నానంటూ వస్తున్న వార్తలను హీరో సునీల్ కొట్టిపడేశారట. తాను రాజకీయాలకు సరిపోయే వ్యక్తిని కానని సునీల్ చెప్తున్నారట. పవన్ కళ్యాణ్ అంటే తనకు బాగా ఇష్టమని, ఆయనతో తనకు మంచి అనుభంధం ఉందని అంటున్నారట.తనను పార్టీలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు మనసులో ఉందని, అయితే రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని సునీల్ స్పష్టం చేస్తున్నారట.ఇక పార్టీలో చేరాలని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు కూడా సునీల్ ఇదే విషయాన్ని పవన్ కు చెప్పారట. అదేసమయంలో పవన్ కళ్యాణ్ కు తన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితం తన వంతుగా ఏదైనా చేస్తానని, అయితే అది రాజకీయంగా కాదని సునీల్ చెప్పారట.దానికి కారణం తనకు రాజకీయం అంటే ఏంటో తెలియదు అని సమాధానం ఇస్తున్నారట.
అయితే దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ హీరో సునీల్ ఇచ్చేశారని, అయితే రాజకీయాల్లో ఏదైనా, ఎప్పుడైనా జరగవచ్చని.. పరిణామాలను ముందుగా అంచనా వేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారట.