చెత్త పన్ను కట్టలేదని దుకాణాల ముందు చెత్త తెచ్చి పోశారు ల్కర్నూ నగరపాలక సంస్థ కార్మికులు. ఈ ఘటన మరువక ముందే తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మునిసిపల్ కార్పొరేష్ లో వెలిసిన గోడ పత్రికలు చర్చనీయాంశంగా మారాయి.ఇంటి పన్ను, కుళాయి పన్ను కట్టకుంటే ఇంట్లోని సామాన్లను తీసుకుపోతామని ఆ గోడ పత్రికల్లో అధికారులు పొందుపరిచారు. ఇక మునిసిపాలిటీ వాహనాలకు వీటిని అంటించి కార్పొరేషన్ పరిధిలో ప్రచారం చేయిస్తున్నారు అధికారులు. కాకినాడలో ఎక్కువగా పేదలు నివసించే దుమ్ములపేట, పర్లోవపేట, సంజయ్‌నగర్, సాంబమూర్తి నగర్, రేచెర్లపేట, ఏటిమొగ, అన్నమ్మఘాటీ తదితర ప్రాంతాల్లోనే కార్పొరేషన్ అధికారులు ‘జప్తు’ హెచ్చరికలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు, రాజకీయ నేతలు లక్షల్లో ఆస్తిపన్ను బకాయిలున్నా పట్టించుకోని అధికారులు పేదలు నివసించే ప్రాంతాలపైనే దృష్టి పెట్టడం విశేషం అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Must Read:-ఆస్తులన్నీ అమ్మి.. చెత్తపై పన్నువేస్తున్నాడు! – చంద్రబాబు