నరసాపురం ఎంపీ రఘురామరాజు వ్యవహరం సంచనలంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు రోజురోజుకూ ఆసక్తిగా మారుతుంది. ఇవాళ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మిలటరీ ఆస్పత్రిలోని అప్సర వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు అందించిన నివేదికను తమకు అందించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ వినీత్ శరన్ చెప్పారు. రఘురామరాజుకు జనరల్ ఎడిమా ఉందని, కాలి వేలికి ఫ్రాక్చర్ తో పాటు మరికొన్ని గాయాలు ఉన్నట్లు నివేదికలో తెలిపినట్లు జస్టీస్ వినీత్ శరన్ అన్నారు. రఘురామ రాజు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సీబీఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు.
Must Read ;- సుప్రీంలో సుదీర్ఘ విచారణ.. ఎంపీ రఘురామరాజుకు షరతులతో బెయిల్

















