ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు కొనసాగాయి. దాదాపు గంటపాటు చర్చలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కొన్ని షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. అయితే ఎప్పుడూ విచారణకు పిలిచిన రఘురామరాజు సహకరించాలని, ప్రభుత్వం కూడా ముందుగానే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
బెయిల్ కండీషన్స్
- దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు సహకరించాలి.
- న్యాయవాది సమక్షంలో విచారణ జరగాల్సి ఉంటుంది.
- దర్యాప్తును ప్రభావితం చేయకూడదు.
- మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.
Must Read ;- రఘురామ కాలికి ఫ్యాక్చర్ తో పాటు మరికొన్ని గాయాలు : సుప్రీంకోర్టు










