టీడీపీ నాయకురాలు గౌతు శీరిష మహానాడు వేదికగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆగాడాలపై విరుచుకుపడ్డారు. కిందిస్థాయి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందంటూ వివరించారు. ‘‘ఈరోజుల్లో ప్రజల్లోకి ఏదైనా సమాచారం వెళ్లాలంటే మీడియాదే ప్రధాన పాత్ర. మరి అలాంటి మీడియాపై అధికార పార్టీలు కేసులు పెడుతోంది. ప్రజలకు నిజాలు తెలియజేసే ఏబీఎన్, టీవీ5 లాంటి మీడియాపై ఆంక్షలు విధిస్తోంది. మీడియాను అసెంబ్లీలోకి రానివ్వకపోడం, వాళ్లు చేసే చేసే చేష్టలు బయటకు రాకుండా చేస్తోంది. ప్రతిరోజు కష్టించి పనిచేస్తున్నాం. గ్రామాల్లో సైతం టీడీపీ నాయకులను, కార్యకర్తలను అణచివేస్తున్నారు. మేం కచ్చితంగా మళ్లీ అధికారంలో వస్తాం. వడ్డీ సహా చెల్లిస్తాం. ఈ సారి చంద్రబాబునాయుడు మెతక వైఖరి వీడి, వేధింపులకు గురిచేసినవాళ్లపై కేసులు పెట్టాలి సార్’’ అంటూ గౌతు శీరిష ఎమోషన్ ల్ గా మాట్లాడారు.
Must Read ;- అక్రమ కేసులు పెట్టిన వారు ఎక్కడున్నా వదలం : అచ్చెన్నాయుడు










