గ్లామర్ ప్రపంచంలో ఆమె చాలా ప్రత్యేకం. బోల్డ్ నెస్ విత్ హాట్ నెస్ కలిపితే ఆమె. పేరు శ్రధ్ధా ఆర్య. ముంబై కి చెందిన ఈ సుందరి.. మోడలింగ్ తో తన కెరీర్ బిగిన్ చేసింది. గ్లామర్ మీద మోజుతో సినీ ఇండస్ట్రీకి వచ్చింది. పలు టాలెంట్ షోస్ లో పాల్గొన్న అమ్మడు ఒక తమిళ మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ పై వర్మ ‘నిశ్శబ్ద్’ సినిమాతో బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయింది.
2007 లో గొడవ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది శ్రద్ధా ఆర్య. ఆ తర్వాత కోతిమూక, రోమియో లాంటి సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ గా మెరిసింది. అయితే ఆమెకి ఏ ఒక్క సినిమాతోనూ సరైన గుర్తింపు రాలేదు. దాంతో వేరే భాషల్లోనూ ప్రయత్నం చేసింది. తమిళ, తెలుగుతో పాటు మలయాళం, పంజాబీ లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినాసరే ప్రయోజనం లేకపోయింది. దాంతో పలు టీవీ షోస్, సీరియల్స్ తో బాలీవుడ్ జనం మనసు దోచుకుంది.
ప్రస్తుతం శ్రద్ధా ఆర్య తన ఫోకస్ అంతా సోషల్ మీడియాపైనే పెట్టింది. అక్కడ అమ్మడి గ్లామర్ షోస్ కి బోలెడంత ఫాలోయింగ్ ఏర్పడింది. తరచుగా తన హాట్ ఫోటోస్ తో నెటిజెన్స్ ను కవ్విస్తూండే ఆర్య.. తాజాగా పోస్ట్ చేసిన స్విమ్ సూట్ బాత్ షవర్ ఫోటోస్ మతులు పొగొట్టేస్తున్నాయ్. ఫ్లవర్స్ తో కూడిన స్విమ్ సూట్ లో బాత్ షవర్ స్నానం చేస్తూ.. అందాలన్నీ ప్రదర్శించింది శద్ధా ఆర్య. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మోనోకిని ఫోటోస్ తోనైనా ఆమెకి మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.
Must Read ;- హాట్ నెస్ తో చితక్కొడుతోన్న నిక్కీ తంబోలి