పేదలు, సామాన్యులకు పంచే ఆనందయ్య మందును. పెద్దలకు బక్కెట్లతో పంచడం ఎంతవరకు సమంజసం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు అందాల్సిన మందును ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుండటంతో సోమిరెడ్డి గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం ఆనందయ్య మందును కోరుకుంటున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆనందయ్య మందు తీసుకున్నవాళ్లందరికీ మంచే జరిగిందని, ఏ ఒక్కరికీ హనీ జరగలేదన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆనందయ్యను బంధించడం నిజంగా బాధకరమన్నారు. వెంటనే ప్రభుత్వం ఆనందయ్య మందుపై నిర్ణయం తీసుకొని, పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
Must Read ;- ఆనందయ్య మందుపై వైసీపీ దందా.. వంట వాళ్లతో పెద్ద ఎత్తున తయారీ










