కరోనా మహమ్మారి నుండి ఇంకా దేశం నుంచి వెల్లనే లేదు. వ్యాక్సిన్ వస్తుంది.. కరోనాకు చెక్ పెట్టచ్చు అని ప్రభత్వాలు, ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరొక వ్యాధి దేశమంతా పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 9 మంది చనిపోయారు. అలాగే దాదాపు 44 మంది హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం. కేవలం ఒక్క ప్రాంతంలో కాదు.. ఢిల్లీ, గుజరాజ్, ముంబై, అహ్మదాబాద్‌లలో పలు కేసులు నమోదైనట్లు సమాచారం.
ఫంగల్ ఇన్ఫెక్షన్
‘మ్యుకోర్మికోసిస్’ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. గతంలో ఇదే వ్యాధిని జైగోమైకోసిస్ అని పిలిచేవారు. మ్యుకోర్మికోసిస్ అనే ఫంగస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధి చాలా అరుదైనదిగా వైద్యులు పేర్కోంటున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో హాస్పిటల్‌లో చేరిన 44 మంది వ్యాధిగ్రస్తుల్లో 9 మంది మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనైనా వ్యాప్తి చెందుతుందని, దీన్ని మొదట్లోనే గుర్తించినట్లైతే, చికిత్స సులభమవుతుందని వైద్యులు అంటున్నారు. ఒకవేళ ఆలస్యంగా గుర్తించిన సమయంలో కొన్ని కేసలు మరణానికి దారి తీస్తున్నాయని చెప్పుకొచ్చారు.
పలు నగరాల్లో కేసులు
అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీలో దాదాపు 12 మంది ఈ వ్యాధి సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా ముంబై, గుజరాత్‌లో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఒక నగరానికి, మరొక నగరానికి సంబంధమేమీ లేకపోయినా.. ఇలా కేసులు నమోదు కావడంతో అధికారులు హై అలర్టు అవుతున్నారు. కరోనా నుండి కోలుకున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండడం గమనార్హం. ఈ వ్యాధి వ్యాప్తికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోతే పలు ప్రాంతాలకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు.. నివారణ చర్యలు
ముక్కులో సాధారణ ఇన్ఫెక్షన్‌లా ప్రారంభమవుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ఫంగస్ కళ్లకు, ముక్కు, గొంతు వాటికి వ్యాప్తి చెంది తీవ్రతరం అవుతుందని వైద్యుల వ్యాధి లక్షణాలు గురించి తెలియజేస్తున్నారు. వ్యాధి రాకుండా ఉండాలన్నా.. వ్యాప్తిని అరికట్టాలన్నా.. వ్యక్తిగత శుభ్రత అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. ముక్కును తాకిన చేతులతో కళ్లను తాకకూడదు. ముక్కు, కళ్లు, గొంతు ప్రాంతాల్లో వాపు లాంటివి ఏ మాత్రం గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. తొలి దశలో గుర్తించిన వ్యాధి నయం చేయడం సాధ్యమవుతుందని వైద్యులు చెప్తున్నారు.
Must Read ;- కరోనా టీకా పంపిణీ చర్యలను ముమ్మరం చేసిన కేంద్రం