ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్డినెన్స్ సీఎం అని టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి అన్నారు. బడ్జెట్‌పై కూడా ఆర్డినెన్సులు జారీ చేసే ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. దుష్ట రాజకీయాలు, ఎన్నికల పేరుతో బడ్జెట్ ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం సరికాదన్నారు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ అసెంబ్లీపై లేదని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల దశ దిశను నిర్ణయించే బడ్జెట్‌ను కూడా ఆర్డినెన్స్ రూపంలో ఆమోదింపజేసుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల లెక్కలు బయటపడుతాయనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఆర్డినెన్స్ బడ్జెట్ తీసుకొస్తున్నాడని టీడీపీ నాయకులు కొందరు విమర్శించారు.
Must Read ;- ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ సరికాదు : యనమల రామకృష్ణుడు