ఏపీ సీఎం ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండోసారి కూడా రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్ ఇవ్వడం టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. బడ్జెట్ కూడా ఆర్డినెన్స్ ల రూపంతో ఆమోదం పొందే దుష్ట సాంప్రదాయాన్ని జగన్ తెచ్చారని, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా, ఎక్కడా బడ్జెట్‌పై కేంద్రంగాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఆర్డినెన్స్ ఇవ్వలేదని చెప్పారు. ఏపిలో మాత్రమే తిరుపతి ఉప ఎన్నిక వంకతో, మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సాకుతో బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా వాయిదాలు వేయడం సమంజసం కాదన్నారు.
Must Read ;- వరుస ఎదురుదెబ్బలు.. అయినా ఆగని జగన్ పగల సెగలు!











