మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఒక పక్క ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే.. మరో పక్క రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూట్ లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకూ రిలీజ్ డేట్స్ లాక్ అవడంతో .. చెర్రీ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ .. తమిళ దర్శకుడు శంకర్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో శంకర్ యాజ్ యూజువల్ గా ఇందులో కూడా ఒక సామాజిక సమస్యను ఇన్ సర్ట్ చేయబోతున్నాడని టాక్. అంతేకాదండోయ్.. ఇందులో చరణ్ యువ ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడట. అర్జున్ తో శంకర్ తీసిన ఒకే ఒక్కడు సినిమా కథను పోలి ఉంటుందని అంటున్నారు. అంటే ఒక విధంగా ఆ సినిమాకిది సీక్వెల్ అని చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రా కాదా అనే విషయాలు తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- తండ్రి కొడుకులతో ఆచార్య మెగా పోస్టర్