టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పది లక్షల గృహాలను పేదలకు వెంటనే ఇవ్వాలంటూ టీడీపీ నేతలు మందడం నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. 4 లక్షల టిడ్కో ఇళ్లు సిద్దంగా ఉన్నా, వాటిని పేదలకు ఇవ్వకుండా ప్రభుత్వం లబ్దిదారులను వేధిస్తోందిన టీడీపీ నేతలు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టిడ్కో ఇళ్లు పేదలకు పంచకపోతే, టీడీపీ ఆధ్వర్యంలో ఆపని చేస్తామని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
టీడీపీ నేతలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబనాయుడు కూడా పాల్గొన్నారు. వారంతా పాదయాత్రగా నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.











