తెలంగాణలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కరోనా కట్టడి కోసం వైద్యశాఖ కోరిక మేరకు లాక్ డౌన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తుండటం.. కేసుల, మరణాలు కూడా తక్కువస్థాయిలో నమోదు కానుండటంతో లాక్ డౌన్ పొడిగింపునకే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాణిజ్య, ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 28 సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- ఓరుగల్లుకు కేసీఆర్ : గాంధీ తరహాలోనే ఎంజీఎం పరిశీలన











