వైసీపీ ప్రభుత్వం కరోనా రోగులను పట్టించుకోకుండా గాలికొదిలేసి,టీడీపీ నేతల అరెస్టులు,గృహ నిర్భంధాలపైనే దృష్టి సారించిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.టీడీపీ నేతలను తెల్లవారకముందే గృహనిర్బంధం చేయడం శోచనీయమన్నారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.జగన్‌రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని,ఇప్పటికైనా టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
టీడీపీ నేతల గృహ నిర్భంధం
అన్ని జిల్లాల్లో కరోనా బాధితులను పరామర్శించాలని టీడీపీ అధినేత పిలుపుతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది.ఇవాళ టీడీపీ నేతలు కరోనా కేంద్రాల్లో రోగులను పరామర్శించనీయకుండా,పోలీసులు ముందస్తు గృహ నిర్బంధాలు చేస్తున్నారు.పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును తెల్లవారుజామునే పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఇక మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు,నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని కాకినాడలో పోలీసులు గృహనిర్భంధం చేశారు.చింతలపూడి ప్రభాకర్‌ను కూడా పోలీసులు నిర్భందించారు.భీమడోలులో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరంజనేయులు,ఎమ్మెల్సీ బీటెక్ రవి,బడేటి బుజ్జిని గృహ నిర్భంధం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్భంధం చేశారు.
Must Read ;- అరాచకాలను ప్రశ్నించే వారిపై దాడులు : చంద్రబాబు










