తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ యువ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను అప్యాయంగా పలుకరిస్తూ, వాళ్లతో టీ తాగుతూ, ముచ్చట చెప్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరిస్తూనే, టీడీపీకి మద్దతు ఇచ్చేలా ప్రచారం చేస్తున్నారు. ఎండలను సైతం లెక్కచేయకుండా తిరుపతిలో ప్రచారం చేస్తున్నారు. కేసినేని శ్వేత, ప్రణవ్ గోపాల్, బండారు శ్రవణి, భరత్, ఎస్సీ సెల్ ప్రసిడెంట్ రాజు, బొజ్జల సుధీర్ లు గ్రూపులుగా ఏర్పడి, పనబాక గెలుపుకోసం తిరుపతిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
Must Read ;- యువత జయహో : యువతరంతో ఉరకలేస్తున్న టీడీపీ
తిరుపతి ఉప ఎన్నిక ప్రచార ఫొటోలు…















