ఇంకోరోజుకు వాయిదా వేస్తే వచ్చే నష్టమేమిటి!
ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏపీ విద్యాశాఖ అధికారులు తీవ్ర గందరగోళంలో పడేశారు. విద్యాశాక నుంచి అలా ఆదేశాలు వచ్చాయే లేదో జిల్లా విద్యాశాఖాధికారులు మారుమాట్లాడకుండా ఉపాధ్యాయులకు ఆ ఆదేశాలను ఇట్టే పాస్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో ప్రపంచ మరుగు దొడ్ల దినోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ ఆదేశాలను జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులు వాట్సప్ ద్వారా సందేశాన్ని పంపారు. అది చూసిన టీచర్స్ కంగుతిన్నారు. విద్యాశాఖ అధికారులు పంపిన ప్రభుత్వ సర్క్యూలర్ ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు ఆప్షనల్ హాలిడే ఉంటుందని, అటువంటి దినాల్లో ఇటువంటి కార్యక్రమాలను తమతో చేయించడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిని మరుసటి రోజుకు వాయిదా వేస్తే వచ్చే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నాయి.
హిందూ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోండి!
ప్రభుత్వ ఉత్తర్వులకు,ఆదేశాలకు కట్టుపడే ఉద్యోగులు పనిచేయాలి అది రూల్. దానిని కాదంటే కష్టమే. కాకపోతే పర్వదినాలు, పండుగ రోజుల్లో అశుభ్రాన్ని శుభ్రం చేయమని ఆదేస్తే ఎలా అని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. అది హిందువులు పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించమని చెప్పడమేమిటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్ల మనోభావాలను దెబ్బతీసేలా, వారి క్షోభకు గురిచేయడం తప్ప వేరొకటి ఉండదని టీచర్స్ యూనియన్స్ మండిపడుతున్నారు.ఇప్పటికే ప్రతిరోజు మరుగు దొడ్ల ఫోటోలను తీసి యాప్ లో పెట్టాలన్న నిబంధన తీసుకొచ్చి టీచర్ల ఇబ్బందలకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.











