తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తరువాత అంతర్గత కుమ్ములాటలు.., రాజకీయ హైడ్రామాకు తెరలేచింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్ధి ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో అన్నీ అపోహలకు తెరదించుతూ.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎల్పీ లీడర్ గా డిక్లేర్ చేసింది. డిసెంబర్ 7 ఉదయం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని కన్ఫామ్ చేసింది అధిష్టానం. మరోవైపు రేవంత్ తో పాటు డిప్యూటి సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క, ఆర్ధిక శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రుల జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వడబోత కార్యక్రమం జరుగుతోంది. రాజకీయ సమీకరణలు.., సీనియార్టీ ప్రాతిపదికన మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకునే ప్రక్రియ జరుగుతోందని కర్నాటక డిప్యూటీ సీఎం, పార్టీ ట్రబుల్ ష్యూటర్ డీకే శివకుమార్ వివరించారు.
నవంబర్ 30వ తేదీన ముగిసిన తెలంగాణ ఎన్నికలు…. డిసెంబర్ 3న ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఆ తరువాత క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు ..? అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఎమ్మెల్యే ఏకవాక్య తీర్మానం మేరుకు అందరూ ఊహించినట్లుగానే రేవంత్ రెడ్డికే పాలన పగ్గాలు అప్పగిస్తూ ఢిల్లీలో హైకమాండ్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది.
సీఎల్పీ సమావేశంలో ఎమ్మల్యేలు చెప్పిన అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలికులు డీకే శివకుమార్ అధిష్టానానికి సమర్పించారు. రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రతిపాదించారు. దీంతో ముఖ్య నేతల భేటీ.., నాయకులు సుదీర్ఘ చర్చలు అనంతరం రేవంత్ రెడ్డినే సీఎంగా ప్రకటించారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.