ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన ఇంకొద్ది నెలల్లో ముగిసిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో తనకు బాగా సాయపడ్డ మిత్రుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యుపకారం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించి భంగపడ్డారు. కేసీఆర్‌కు అధికారం కోల్పోయేంత నష్టం చేశారు. ఏకంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కొంత మందిని హైదరాబాద్ లో ఉంచి, స్థానిక అభ్యర్థులకు సాయం చేసినప్పటికీ ఫలితం లేదు. వైఎస్ఆర్ సీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు కొంతమంది గత కొంత కాలంగా హైదరాబాద్‌లో మకాం వేసి బీఆర్‌ఎస్ విజయం కోసం.. వివిధ మార్గాల్లో తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో విశ్లేషించారు.
ఆయన విశ్లేషణ ప్రకారం.. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై బాగా ఉండబోతుందన్న అభిప్రాయం ఉంది. జగన్ రెడ్డి పాలనతో పోల్చితే కేసీఆర్ పాలన ఎంతో మెరుగ్గా ఉంటుందని అందరికీ తెలుసు. కాకపోతే, ఆయన అహంకార పూరిత వ్యవహార శైలి కారణంగానే, ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అలాంటి వ్యక్తినే తెలంగాణ ప్రజలు ఓడించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సారి జగన్‌ను ఓడించకుండా ఉంటారా? అనే వాదన బాగా వస్తుంది. తెలంగాణలో సంక్షేమ పథకాలతో పాటుగా డెవలప్‌మెంట్ అనేది అద్భుతంగా కనిపిస్తోంది. రోడ్లు, నీళ్లు వంటి మౌలిక సదుపాయాలు తెలంగాణలో బాగా మెరుగుపడ్డాయి.
అదే ఏపీలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం తప్పితే అభివృద్ధికి తావు లేకుండా చేశారు. ఏ పార్టీ అయినా మళ్లీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి. జగన్ పాలనపై అదే లేదు. అందుకే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోగానే ఇక ఏపీలో జగన్ పని కూడా ఖతం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీ ప్రభుత్వ అధికారుల వైఖరిలో కూడా మార్పు వచ్చిందన్న వాదన కూడా ఉంది.
అసలు కేసీఆర్‌ను కాపాడుకోవడం కోసం జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఒకవేళ జగన్ ప్రయత్నాలు ఫలించి ఉండి కేసీఆర్ గెలిచి ఉంటే ఆయన ధీమా మరోలా ఉండేది. ఇప్పుడు తన ప్లాన్ తిరగబడడం.. అంతేకాక, కేసీఆర్ అండ్ కో కి నష్టాన్ని తెచ్చిపెట్టడడంతో మిత్రుడ్ని ఇబ్బందులోకి నెట్టాననే బాధ జగన్ లో ఉన్నట్లు సమాచారం. అంతకుమించి వచ్చే టర్మ్ లో తనకు ఇక సీఎం సీటు ఉండదనే భయం జగన్‌కు నిద్రపట్టనీయడం లేదని టాక్