స్టార్ మా బిగ్ బాస్ 5 ప్రారంభమైంది. యథా ప్రకారం ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. నాగార్జునకు హోస్ట్ గా ఇది ముచ్చటగా మూడోసారి. మొదట యూట్యూబర్ సిరిహన్మంత్ మొదట హౌస్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత వీజే సన్నీ వచ్చి ఆమెకు తోడయ్యాడు. సాయంత్రం ఆరు గంటలకు షో ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ మొదట 17 మంది అనుకున్నారుగానీ చివరికి 19 మంది అర్థమవుతోంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ మాత్రం ఫైనలైజ్ అయ్యారు. వారు ఎవరెవరో చూద్దాం.
యాంకర్ రవి, షణ్ముక్ జస్వంత్, మానస్ నాగులపల్లి, కార్తీకదీపం ఉమాదేవి (భాగ్య), ఆర్జే కాజల్, శైలజా ప్రియ, శ్రీరామచంద్ర, సరయురాయ్, అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, శ్వేతావర్మ, లహరి, లోబో, జబర్దస్త్ ప్రియాంక, విశ్వ.. వీరంతా ఈరోజు నుంచి హౌస్ లో ఉంటారు.ఈ షోలో వినోదం పండాలంటే ప్లేయర్స్ దే కీరోల్. దాదాపు 100 రోజుల పాటు షో కొనసాగుతుంది. ఎలిమినేషన్ పర్వం వస్తేనే గానీ షోపై ఉత్కంఠ రాదు.
Must Read ;- హిమానీ బుందేలా బన్ గయా కరోడ్ పతి











