తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ‘రియాలిటీ షో’ బిగ్ బాస్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. మొదటి సీజన్ ను హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయవంతంగా నడిపించగా రెండో సీజన్ ను నాచురల్ స్టార్ నాని తనదయిన స్టైల్ లో సక్సెస్ చేశారు. మూడవ సీజన్ ను యువ సామ్రాట్ నాగార్జున తన స్క్రీన్ ప్రజెన్స్ తో సామాన్యులకు కూడా పరిచయం చేశాడు. దీంతో స్టార్ మా యాజమాన్యం నాలుగో సీజన్ కు ఏరి కోరి మరి నాగార్జునను ఎంపిక చేశారు. కరోనా ఉదృతితో యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకొంది. దాదాపు 100 రోజులు సాగేలా ఈ సీజన్ ను ప్లాన్ చేసిన నిర్వాహకులు కంటెస్టెంట్స్ గా 20 మందిని ఎంపిక చేశారు. మొదట వీరందరిని హోమ్ క్వారంటైన్ లో ఉంచారు.
కరోనా నెగటివ్ గా వచ్చిన 16 మందిని మాత్రమే హౌస్ లోకి పంపాలని నిర్ణయించుకున్న నిర్వాహకులు స్టాండ్ బైగా పెట్టినట్లు తెలుస్తోంది. డాన్సర్ రఘు మాస్టర్ ఇప్పటికే ఈ షోకు గుడ్ బై చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో షోలో పాల్గొనబోయే 16 మంది పేర్ల జాబితా లీక్ అయింది. ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వార్తల ప్రకారం నందు (హీరో), అభిజిత్ (హీరో), మోనాల్ గుజ్జర్ (హీరోయిన్), కరాటే కళ్యాణి (కామెడీ నటి), సూర్యకిరణ్ (దర్శకుడు), సురేఖ వాణి (సహాయ నటి), అమ్మ రాజశేఖర్ (డాన్స్ మాస్టర్), ముక్కు అనినాష్ (జబర్దస్త్ ఫేం), లాస్య (యాంకర్), దేవి (టీవీ9 న్యూస్ ప్రజెంటర్), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (స్మాల్ స్క్రీన్ నటి) పాల్గొనున్నారు.
నోయల్( నటుడు,సింగర్), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు), అరియానా గ్లోరీ (యాంకర్, జెమిని కెవ్వు కామెడీ యాంకర్) కూడా కంటెస్టెంట్స్ గా ఈ సీజన్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ లతో బాటు సోషల్ మీడియా పాపులర్ నటీ నటులను ఈ సీజన్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేత్తడి ఫేమ్ హారిక, బిత్తిరి సత్తి ప్రోగామ్స్ లో పాపులర్ అయిన గంగవ్వ, అరియానా గ్లోరీ, మెహబూబా దిల్ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో నిజమెంత తెలియాలంటే సాయంత్రం 6 గంటల వరకు వేచిచూడవలసిందే..!











