‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్ 4’ మిగిలిన అన్ని షోల కన్నా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ షోకి అనేకమంది సినీ ప్రముఖులు అతిధులుగా హాజరైయ్యారు. ఆ సమయంలో టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా పెరిగాయి. సమంత అక్కినేని చేసిన ఒక్క ఎపిసోడ్ తో షోకి టీఆర్పీలు బాగానే వచ్చియి. ఇకపోతే ఫైనల్ ఎపిసోడ్ ను సాలిడ్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఎన్టీఆర్ ను ముఖ్య అధితిగా పిలిచి ప్రేక్షకులను థ్రిల్ చేద్దామని భావించారు. తద్వారా టీఆర్పీ రేటింగ్స్ కూడా తారా స్థాయిలో వస్తాయని అంచనా వేశారు. కానీ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు హాజరు కాలేరని చెప్పాడట.
Must Read ;- బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు ఈ స్టార్ హీరో వస్తాడా?
అయినా సరే ఎన్టీఆర్ ను ఎలాగైనా ఫైనల్ ఎపిసోడ్ కు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఒక వేళ ఎన్టీఆర్ గనుక రాకపోతే బిగ్ బాస్ నిర్వాహకులు మరో ఆప్షన్ని కూడా పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది. నాగార్జునకు అత్యంత సన్నిహితుడు, మా టీవీ సహ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవిని ఫైనల్ ఎపిసోడ్ కు తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నారట. చిరంజీవి ఆ ఎపిసోడ్ కు వస్తే మెగా అభిమానులందురూ టీవీలకు అతుక్కుపోతారని అంచనా వేస్తున్నారు. తద్వారా ఇప్పటివరకు కనివిని ఎరుగని టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. గత సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు కూడా చిరంజీవి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఒకే స్టేజిపై ఇద్దరు టాలివుడ్ స్టార్ హీరోలు కనపడతే ఆ కిక్కు ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి ఉదయపూర్ నుండి హైదరాబాద్ చేరుకోగానే బిగ్ బాస్ ప్రతినిధులు ఆయనను కలుస్తారని తెలుస్తోంది. చిరంజీవి, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరు వచ్చినా ఫైనల్ ఎపిసోడ్ మాత్రం దద్దరిల్లిపోతుందని చెప్పచ్చు. త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ రానున్నది.
Also Read ;- బిగ్ బాస్ 4 విన్నర్ గా ఆమెను గెలిపించమంటున్న వర్మ