‘బిగ్ బాస్ 4’.. రికార్డ్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళుతూ ఎండింగ్ కి వచ్చేసరికి ఈ రియాల్టీ షో పై మరింత ఆసక్తి ఏర్పడింది. టాప్ 5లో ఎవరు నిలుస్తారు.? టాప్ 3 లో ఎవరు నిలుస్తారు.? ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారు.? అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. డిసెంబర్ 20న గ్రాండ్ ఫైనల్. దీనికి సంబంధించిన ఏర్పాట్లో స్టార్ మా టీవీ యాజమాన్యం బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. గ్రాండ్ ఫైనల్ దగ్గరపడుతున్న కొద్దీ.. సోషల్ మీడియాలో ఎవరకి నచ్చిన వాళ్లను వాళ్లు సపోర్ట్ చేస్తూ తమ ఫేవరేట్ కంటెస్టంట్ ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read ;- బిగ్ బాస్ 4 విన్నర్ గా ఆమెను గెలిపించమంటున్న వర్మ
అయితే.. షోలో రోజురోజుకు అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఊహించని విధంగా కంటెస్టంట్ ల గ్రాఫ్ పడిపోవడం.. కొంత మంది గ్రాఫ్ లేవడం జరుగుతుంది. ఇటీవల గ్రాఫ్ పడిపోయింది ఎవరిదంటే.. అందరూ ఠక్కున చెప్పేపేరు సోహేలే. ఇతనికి కోపం బాగా ఎక్కువ. ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున గతంలో అతనికి చెప్పారు. నీ కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఆతర్వాత అతని ప్రవర్తనలో మార్పు రావడంతో అనూహ్యంగా గ్రాఫ్ పెరిగింది.
అయితే.. లేటెస్ట్ గా అరియానా విషయంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆమె పై సోహేల్ ప్రదర్శించిన కోపాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ అతడి పై విరుచుకుపడుతున్నారు. ఈ విధంగా సోహేల్ తన చేతులారా తన గ్రాఫ్ ని తనే పడిపోయేలా చేసుకున్నాడు. ఆడపిల్ల పై అంతలా అరవాలా..? అని నెటిజన్లు సోహేల్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో షోలో గ్రాఫ్ లు తారుమారు అయ్యాయి. ఈ వీకెండ్ నాగార్జున ఏం చెబుతారో.? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అని వీక్షకులు వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని రోజులే ఉంది. ఏం జరగనుందో చూడాలి.
Must Read ;- అక్కినేని నాగార్జున 2021 ప్లాన్ ఇదే..!