సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటుంటాడు. తన మాటలతో.. తన ట్వీట్ లతో వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి బిగ్ బాస్ గురించి ట్వీట్ చేసి అందర్నీ సర్ ఫ్రైజ్ చేసాడని చెప్పచ్చు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. బిగ్ బాస్ 4 తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రేక్షకాదరణతో రికార్డ్ టీఆర్పీతో దూసుకెళుతుంది. ఇప్పడు ఈ షో చివరకు చేరుకోవడంతో మరింత రసవత్తరంగా మారింది. దీంతో ఈసారి బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు.? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ పోటీలో నిలిచిన వాళ్ల సన్నిహితులు ఎవరికి తోచినట్టుగా వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే.. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో బిగ్ బాస్ షో గురించి స్పందిస్తూ.. ఓ వీడియో పోస్ట్ చేసారు. అందులో అరియానా, అభిజిత్ ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ విన్నర్ గా అరియానాను గెలిపించాలని.. ఆమె ఆ టైటిల్ కి అర్హురాలు అని.. అందరూ ఆమెకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వర్మ ఇలా ట్విట్టర్ లో బిగ్ బాస్ గురించి స్పందించడం.. అరియానాని గెలిపించమనడం.. ఆసక్తిగా మారింది. వర్మ ఇలా ట్వీట్ చేయడంతో.. వర్మ బిగ్ బాస్ కూడా చూస్తున్నాడా..? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వర్మ అరియానాకి సపోర్ట్ చేయడానికి ఓ రీజన్ ఉంది. అది ఏంటంటే.. గతంలో వర్మను అరియానా ఇంటర్ వ్యూ చేయడం.. ఆ ఇంటర్ వ్యూ వైరల్ అవ్వడం తెలిసిందే. అప్పటి నుంచే అరియానా బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు వర్మ ఇలా అరియానాని గెలిపించమనడం పై నెటిజన్లు సానుకూలంగానే స్పందిస్తున్నారు. మరి.. వర్మ కోరుకుంటున్నట్టుగా అరియానా బిగ్ బాస్ 4 విజేతగా నిలుస్తుందా..? లేక మరొకరు ఎవరైనా టైటిల్ గెలుచుకుంటారో చూడాలి.
Must Read ;- ప్రజాస్వామ్యం వల్ల బతికిపోయావ్ ముందు మంచి మనిషిగా మారు
VOTE and MAKE ARIYANA WIN ..TRULY DESERVING in BIG BOSS 👍👍👍https://t.co/EnzmWOZkCP pic.twitter.com/hbS5QCXjDK
— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2020











