పాకిస్తాన్ అంటేనే ఎన్నో ఆంక్షలు, అడ్డంకులు. ఇవీ చాలవన్నట్లు ఉగ్రవాదుల కదలికలు. క్షణక్షణం.. భయం భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హిందూ యువతి సత్తా చాటింది. అక్కడి సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సీఎస్ఎస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పాకిస్థాన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (పాస్)కు ఎంపికైంది. పాకిస్థాన్‌లో ఈ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా రికార్డుల్లోకి ఎక్కింది. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని షికార్‌పూర్ జిల్లాకు సనా రామ్‌చంద్ ఈ ఘనత సాధించింది. ఈ సీఎస్‌ఎస్ పరీక్షకు 18,553 మంది హాజరవగా వారిలో 221 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో సనా రామ్‌చంద్ ఒకరు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో సనా అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఒక హిందూ మహిళా ఈ ఘనత సాధించడంతో పాకిస్తాన్ పౌరులంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










