నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం టక్ జగదీశ్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాతలు త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఇక నానీ తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ .. ప్రస్తుతం సెట్స్ మీదుంది. నిన్నమొన్నటి వరకూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ కు కూడా కరోనా సెకండ్ వేవ్ బ్రేకులేసింది. త్వరలోనే సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది.
కలకత్తా బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ కేటగిరిలో రూపొందుతోన్న ఈ సినిమాలో నానీ రాయ్ అనే బెంగాలీ వాసిగా నటిస్తుండగా.. అతడి సరసన కథానాయికగా సాయిపల్లవి అనితర సాధ్యమైన రీతిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. ఇంకా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, మల్లూ సుందరి మడోనా సెబాస్టియన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. టాక్సీవాలా ఫేమ్ .. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన సాయిపల్లవి స్పెషల్ లుక్ ను ఆమె బర్త్ డే సందర్బంగా నేడు విడుదల చేశారు మేకర్స్.
త్రిశూలధారి యై, నుదుటన పెద్ద కుంకుమబొట్టు, ముక్క పుడక, సాంప్రదాయ చీరకట్టులో రివీలైన సాయిపల్లవి.. అచ్చంగా కలకత్తా కాళికా మాతను తలపిస్తోంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఓ పాట సందర్భంగా ఆమె ఈ అవతారమెత్తిందనే విషయం అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ లుక్ కు సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. హైద్రాబాద్ లో పదెకరాల స్థలంలో ప్రత్యేకంగా వేసిన భారీ కోల్ కత్తా సెట్ లో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేశారు మేకర్స్. మరి ఈ సినిమా నానీ, సాయిపల్లవి కెరీర్స్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
His ❤️#ShyamSinghaRoy
Happy birthday Chinni gaaru @Sai_Pallavi92 🤗 pic.twitter.com/kW0UBVIugb
— Nani (@NameisNani) May 9, 2021