జామర్లు ఆన్ చేసి మరి జాగ్రత్తలు..
‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది! ర్యాలీ, బహిరంగా సభ, ఉద్యోగుల మనోభావాలను టెలికాస్ట్ చేయకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంది. మీడియా లైవ్ కిట్స్‌కు సిగ్నల్స్ రాకుండా జామర్లు పెట్టి మరి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసే చర్యులు దారుణమని జర్నలిస్ట్ లు వాపోతున్నారు! ఉద్యమాన్ని కవర్ చేస్తున్న విజువల్స్ ఒక్కటి కూడా బయటకు రాకుండా రాష్ట్రంలోని పలు చోట్లు పవర్ కట్ విధించారు. పలు చోట్ల ఏబిఎన్ ప్రసారాలను నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాత పునరుద్దరించారు. ఏపీలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయడం గమనార్హం! ఉదయం 9 గంటల నుంచి 2.30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. విజయవాడలో ఉద్యోగులు కదం తొక్కిన దృశ్యాలను ప్రజలు చూడకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేశారు. టీవీల ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోవడంతో ప్రజలు సోషల్ మీడియా అయినా యూట్యూబ్, ఫేస్ బుక్స్ ను ఫాలో అయ్యారు. ‘చలో విజయవాడ’ తో ప్రభుత్వ పతనం ప్రారంభమైందని ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, వీ వాంట్ జస్టిస్, హూ ఈజ్ సజ్జల అంటూ ఉద్యోగులు నినాదాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి!
‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొన్న నాలుగు లక్షల మంది ఉద్యోగులు..
ఆంక్షాలు, అరెస్ట్ లు, నిర్బంధాల నడుమ ‘చలో విజయవాడ’‘చలో విజయవాడ’ సూపర్ సక్సెస్ అయ్యింది. లెక్కలు లక్ష మంది అని చెప్పినా.. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా నాలుగు లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారన్నది ఇంటెలిజెన్సీ రిపోర్ట్! లక్షనర మంది ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొంటే.. రెండు నర లక్షల మందిని ఉద్యోగులను విజయవాడకు రాకుండా పోలీసులు నిలిపివేశారు.
Must Read;-జగన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాకిచ్చిన ఉద్యోగులు..! ఇక ప్రభుత్వం పనైపోయినట్లే!!