రాష్ట్రంలో దుర్మార్గ పాలన!
రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వారిపై ఉక్కపాదం మోపి అణివేయాలని చూడటం అమానుషమని చెప్పారు. నిరసన వ్యక్తం చేస్తున్నాఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. కొత్త పీఆర్సీ జీవోలను వైసీపీ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను అహంకారంతో కాకుండా.. ఆలోచనతో స్పందించాలని చంద్రబాబు సూచించారు.
ప్రభుత్వ మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉంది!
జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ.. ప్రశ్నించి హక్కు అందరికీ ఉందని చంద్రబాబు పేర్నొన్నారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని నిలదీశారు. పోలీసుల కాపలాతో ఉపాధ్యాయులను నిర్బంధించడం దారుణమన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, అంకెల గారడీతో ఉద్యోగుల జీతాలు, జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగులను అగౌరవపరిచే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని చంద్రబాబు సూచించారు.
Must Read:-జగన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాకిచ్చిన ఉద్యోగులు..! ఇక ప్రభుత్వం పనైపోయినట్లే!!