రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన ప్రకారమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో తొలినుంచి కూడా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని ఆయన వివరణ ఇచ్చారు.
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే విషయంలో బహుముఖ ఊహాగానాలు సాగిన నేపథ్యంలో.. సోమవారం సాయంత్రం సజ్జల రామకృష్ణా రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తొలినుంచి కూడా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాము ఎన్నికలకు అభ్యంతరం చెబుతున్నాం అన్నారు. ఇప్పటికీ ఎన్నికల వలన వేక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది కలుగుతుందనే భయం ఉన్నదన్నారు.
ఎన్నికల నిర్వహణ సమయంలో రాష్ట్రంలో ఏదైనా జరిగితే దానికి రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించదని సజ్జల చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ భయపడదని సజ్జల చెప్పారు. సుప్రీం కోర్టు వచ్చిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసమాత్రంగా సంప్రదించకుండానే.. కేంద్రానికి లేఖ రాయడం కరెక్టు కాదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
Must Read ;- ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!