రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటంలో వైసీపీ విఫలం
కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో మరోసారి వైసీపీ విఫలమైందని ఆయన ఆరోపించారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి ఏపీకి ఏం సాధిచారని చంద్రబాబు ప్రశ్నించారు. అలానే రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొండిచేయి చూపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నదులు అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామని చెప్పారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్ రంగాలో సంస్కరణలు తీసుకురావడం మంచి పరిణామని ఆయన పేర్కొన్నారు. అంతిమంగా కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారి ఆశాజనకంగా లేదని టీడీపీ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నిర్మలా బడ్జెట్ తో రైతులు,పేదలకు వరిగిందేమి లేదన్నారు.











