అల్లోపతి వైద్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాపై ఉత్తరాఖండ్ వైద్యులు రూ,వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేశారు.15 రోజుల్లోగా రాందేవ్ బాబా లిఖిత పూర్వకంగా క్షమాపణలు తెలపాలని లేకుంటే వెయ్యి కోట్లు చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ ఆయనకు నోటీసులు పంపింది.అంతేగాక ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్‌కు ఐఎంఏ లేఖ రాసింది.అల్లోపతి పనికి మాలిన వైద్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఓ వీడియా గత వారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో భారత వైద్య మండలిలో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ కూడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో రాందేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Must Read ;- ఆనందయ్య మందు కేంద్రాన్ని పరిశీలించిన నారాయణ.. సంచలన వ్యాఖ్యలు










