విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఎఫ్ 2. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా టైమ్ లో అనిల్ రావిపూడి ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటీవల సింహాచలం వెళ్లి ఎఫ్ 3 స్ర్కిప్ట్ కి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ నెలలోనే ఈ సినిమాని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఎఫ్ 2 అంటే ఫన్ అండ్ ఫస్ట్రేషన్. మరి.. ఎఫ్ 3 లో మూడో ఎఫ్ కి అర్ధం ఏంటి అనేది ప్రకటించలేదు కానీ.. ఇప్పుడు మూడో ఎఫ్ మీనింగ్ లీకైంది. ఇంతకీ ఏంటంటే… ఎఫ్ అంటే ఫ్యామిలీ అట. ఈ సినిమాలో ఫన్ ఫస్ట్రేషన్ తో పాటు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇంకా చెప్పాలంటే.. ఫ్యామిలీ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుందట. ఎంటర్ టైన్మెంట్ చేస్తూనే.. బంధాలు – అనుబంధాల ప్రాముఖ్యతను తెలియచేసేలా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఈసారి ఏదో నాలుగు కామెడీ సీన్ లు రాసేసి నవ్వించేశారు అనిపించేలా కాకుండా.. మంచి సినిమా అనేలా కథ రెడీ చేసారట అనిల్ రావిపూడి.
అయితే.. ఎఫ్ 2 సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లోఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని.. ఖచ్చితంగా ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ చాలా కాన్పిడెంట్ గా చెబుతున్నారు. ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లే ఎఫ్ 3 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరి.. ఎఫ్ 2 వలే ఎఫ్ 3 కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశిద్దాం.
Must Read ;- మెగా డాటర్ పెళ్ళికి ప్రత్యేక అతిథి ఈయనేనా?