దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కొవెలమూడి, బాలీవుడ్ స్టోరీ రైటర్ కనికా ధిల్లాన్ పెళ్లి చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం తెలిసిందే. వీరిద్దరు కలిసి అనుష్కతో సైజ్ జీరో అనే సినిమా చేసారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయితే.. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న ఈ జంట మధ్య అభిప్రాయబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఆతర్వాత ప్రకాష్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంటే.. కనిక కధలు రాస్తూ వీరిద్దరు కెరీర్ లో బిజీ అయ్యారు. అయితే.. కనిక బాలీవుడ్ స్క్రీన్ రైటర్ హిమన్షు శర్మతో ప్రేమలో పడింది. ఇటీవల ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను కనిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో దర్శకేంద్రుడి మాజీ కోడలు సెకండ్ మ్యారేజ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రకాష్ కొవెలమూడి ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని.. త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు వచ్చాయి కానీ.. ప్రకాష్ మాత్రం ప్రచారంలో ఉన్న వార్తల పై స్పందించలేదు.