యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘చెక్’. ఐతే, ఒక్కడున్నాడు, అనుకోకుండా ఒకరోజు, సాహసం, మనమంతా చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే… ఇదో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధమవుతోంది.
జైల్లో ఆదిత్య అనే ఒక ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అద్భుతంగా అంటే.. విశ్వనాథ్ ఆనంద్, కాస్పరోవ్.. అనే డైలాగ్స్ మీద టీజర్ ఓపెన్ అవుతుంది. అందులో ఖైదీగా నితిన్ రివీల్ అవుతాడు. అయితే అతడు ఏదో నేరం మీద ఓ జైల్లోకి వచ్చిపడతాడు. అతడ్ని పాయింట్ అవుట్ చేస్తూ. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి.. అదీ నీ గుర్తింపు అని జైలర్ అయిన సంపత్ రాజ్ డైలాగ్ తో ఎంతో ఆసక్తిని రేపుతోంది. లాయర్ గెటప్ లోని రకుల్ హి ఈజ్ ఇన్నోసెంట్ అని అంటూండడాన్ని బట్టి.. అతడు చేయని నేరం మీద ఖైదీగా జైలుకు వెళ్ళాడని తెలుస్తోంది. టోటల్ గా చెక్ టీజర్ ఓ క్రైమ్ థ్రిల్లరని చెప్పక చెబుతోంది. మరి ఈ సినిమా నితిన్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.